దేవరుప్పుల
శాలువాలు వద్దు: పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
జనగామ: తనకు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చే వారు శాలువాలు... పూల బొకేలు తీసుకురావద్దని .. విద్యార్ధులకు అవసరమయ్యే పుస్తకాలు.. నోటు బుక్స్ తేవాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కార్యకర్తలకు సూచించారు. శనివారం దేవరుప్పుల మండలం సింగరాజు పల్లి గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన ప్రజా పాలన అభయ హస్తం ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. అర్హుెలైన ప్రతి ఒక్కరు ఆరు గ్యారెంటీల స్కీమ్ కు అప్లై చేసుకోవాలని.. యంగ్ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని.. అన్ని పథకాలు అందేలా చూసుకుంటారని ఆమె అన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ:
దేవరుప్పుల మండలం ధరావత్ తండా గ్రామం చింత బావి తండాకు చెందిన కునుసోత్ మధుకర్ ఇంట్లో 10 రోజుల కిందట గాస్ సిలిండర్ పేలి ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం కాలిపోయింది. మధుకర్ కుటుంబాన్ని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి,పాలకుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూసుకుంటామని.. తాము సైతం సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్,గ్రామ శాఖ అధ్యక్షుడు ధరావత్ రవీందర్ నాయక్,బిసిసెల్ అధ్యక్షుడు కాడబోయిన గణేష్,యూత్ అధ్యక్షుడు ఉప్పుల అనిల్,నాయకులు దేవ్ నాయక్,అమర్ సింగ్,బాలాజీ,శ్రీకాంత్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కొండ మల్లారెడ్డి , ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Last Updated:2024-01-06
దేవరుప్పుల
ప్లైవుడ్ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
జనగామ:
దేవరుప్పుల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన హార్డ్ వేర్ ,ప్లైవుడ్ మణికంఠ షాపును గురువారం పాలకుర్తి ఎమ్మెల్యే హనుమాండ్ల యశస్వినిరెడ్డి ప్రారంభించారు. వ్రత్తిలో నైపుణ్యాలు సాధించి తమ సొంత కాళ్లపై నిలబడే స్థాయికి ఎదగాలని.. పది మందికి ఉపాధి కల్పించాలని ఎమ్మెల్యే అన్నారు.
ఈ సందర్భంగా షాపు యజమాని మేడోజు నవీన్ స్వప్న దంపతులు యశస్వినిరెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Last Updated:2023-12-28
తిరుపతి
మెట్ల మార్గంలో పాలకుర్తి ఎమ్మెల్యే
జనగామ: తిరుపతి:
కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి మెట్ల ద్వారా కాలినడకన వెళ్తున్న పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ,పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఝాన్సీ రెడ్డి . ఎమ్మెల్యేగా గెలిస్తే కాలినడకన వస్తానని మొక్కుకున్న ఆమె సోమవారం మెట్ల మార్గం ద్వారా వెళ్లారు.
Last Updated:2023-12-25
జనగామ
గవర్నర్ ను కలిసిన పాలకుర్తి ఎమ్మెల్యే
జనగామ: హైదరాబాద్ బొల్లారం రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన విందులో రాష్ట్ర గవర్నర్ తమిళసై ని మర్యాదపూర్వకంగా కలిసిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే హనుమాండ్ల యశస్విని రెడ్డి. ఎమ్మెల్యేగా గెలిచిన యశస్వినిరెడ్డికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. పాలకుర్తికి సంబంధించిన విశేషాలు గవర్నర్ అడిగి తెలుసుకున్నారు.
Last Updated:2023-12-22
జనగామ
జనగామలో ...
జనగామ: గణిత భాష దినోత్సవం సంధర్భంగా విధ్యార్థులు చేసిన కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి ఇందులో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. మరియు విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ పరీక్షలో ప్రతిభ సాధించిన విధ్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. పారమిత ఉన్నత పాఠశాలలో గీతాజయంతి సంధర్భంగా భగవద్గీతలోని శ్లోకాలను విధ్యార్థులు ఆలపించడం, ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది, అదేవిధంగా భూలోకంలోకి భగవద్గీత ఆగమనం గురించి, మానవ సమాజం పై భగవద్గీత యొక్క ప్రభావం, గీతలో శ్రీకృష్ణుడు సంఖ్యా యోగం ద్వారా గణితానికి భగవత్ గీతకి ఉన్న అనుబంధాన్ని, మానవ జీవిత సమస్యలకు భగవత్ గీత ఏ విధంగా పరిష్కారం చూపుతుందో అనే అంశాన్ని, ఏ ఏ దేశాలు ఇట్టి భగవద్గీతను పాఠశాలల్లో పఠిస్థారు అనే అంశాన్ని విధ్యార్థిని విధ్యార్థులు చక్కగా వివరించారు. ఈ సంధర్భంగా విధ్యార్థులు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.
Last Updated:2023-12-22