Live

    తెలంగాణ-> హన్మకొండ

కాకతీయ యూనివర్సిటీ
మిల్క్ సప్లైయర్ నుంచి లంచం డిమాండ్ : ఏసీబీకి చిక్కిన కేయూ ఏఆర్
హన్మకొండ: హాస్టళ్లకు పాలు సరఫరా చేసే వ్యక్తి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఏఆర్‌ కృష్ణయ్య ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అధికారికంగా చెల్లించాల్సిన పాల బిల్లులు లంచం ఇస్తేనే చెల్లిస్తానని చెప్పడంతో దిక్కులేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం యూనివర్సిటీ క్యాంపస్‌లోని తన ఛాంబర్‌లో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేవలం మిల్క్ సప్లయిర్ దగ్గర లంచం తీసుకోవడమే కాదు.. సదరు ఏఆర్ పై మరింత లోతైన విచారణ జరిపితే యూనివర్సిటీ నిధులను స్వాహా చేయడంలో పెద్ద చేప లను గుర్తించే అవకాశం ఉందనే సమాచారం. గతంలో విద్యార్థుల ట్యూషన్ ఫీజులు, ఇతర ఫీజుల రూ.3 కోట్ల కుంభకోణంపై ఏఆర్‌ కృష్ణయ్య, ప్రిన్సిపల్‌ బి ఐలయ్యపై విచారణకు కేయూ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 3 కోట్ల విద్యార్థుల ఫీజు దుర్వినియోగంపై విచారణకు ఆదేశించినప్పుడు కేయూ వైస్ ఛాన్సలర్ రమేష్ కృష్ణయ్యను క్యాంపస్‌కు మార్చారు. ఇదే గాక.. తాజాగా, యూనివర్సిటీ బిల్డింగ్స్ రెన్నోవేషన్ కోసం రూ.10 కోట్లు కేటాయించింది. ఇందులోనూ అవతవకలు జరిగినట్లు తెలుస్తుంది. ఈ విషయంపై పూర్తి స్థాయిలో అధికారులు విచారణ చేపడితే భారీ కుంభకోణం బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Last Updated:2024-01-05

ఉద్యోగ నోటిఫికేషన్‌లు

Remember, torn clothes should not be left at home. Dispose of them out. Buying new clothes like towels.
Read

wearing clothes, bedsheets are like inviting good luck to the home.

Arrange doormats before every door and please change the doormats once in 6/8 months or maximum within 1 year. For More Daily

ట్రెండింగ్
Updated:2024-08-28
500 కార్లతో కవిత రాక        |       489 Reading
Updated:2024-08-28
కవిత విడుదల        |       386 Reading
Updated:2023-12-26
ప్రజాభవన్ దగ్గర కలకలం        |       326 Reading
Updated:2023-12-22
గవర్నర్ ను కలిసిన పాలకుర్తి ఎమ్మెల్యే        |       449 Reading
Updated:2024-02-28
పోలీసుల అదుపులో ముగ్గురు కార్పొరేటర్లు..?        |       129 Reading
Updated:2024-02-28
పోలీసుల అదుపులో ముగ్గురు ర్పొరేటర్లు..?        |       339 Reading
Updated:2023-12-28
100 రోజుల్లో ఆరు గ్యారంటీ పథకాలు అమలు        |       432 Reading
Updated:2024-02-16
అధికారులు లేకుండానే బడ్జెట్        |       143 Reading
చరిత్రలో ఈరోజు [
Warning: Undefined variable $history_date in /home/u558784287/domains/golcondanews.com/public_html/telangana/district.php on line 632
Oct-19 ]


Warning: Undefined variable $history in /home/u558784287/domains/golcondanews.com/public_html/telangana/district.php on line 635

WhatsApp