Live

Pic Ad
    తెలంగాణ ప్రధాన వార్తలు

హైదరాబాద్
కవిత విడుదల
హైదరాబాద్: కవిత విడుదల - బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు - జైలుకు పంపి మొండిదాన్ని చేశారు - కవిత భావోద్వేగం ఢిల్లీ , జ్వాల : ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కవిత జైలు నుంచి విడుదల అయింది. గత కొన్ని రోజులుగా పలుమార్లు బెయిల్ పిటిషన్లు వేసినా కోర్టు వాటిని కొట్టేసింది. చివరగా మంగళవారం తిహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యారు. దిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమెకు సుప్రీంకోర్టు ఇద్దరు సభ్యుల ధర్మాసనం బెయిల్‌ మంజూరు చేసింది. పూచీకత్తు బాండ్లను ఆమె భర్త అనిల్‌, బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టుకు సమర్పించారు. ఈ పూచీకత్తులను ఆమోదించిన రౌస్‌ అవెన్యూ కోర్టు.. కవితను విడుదల చేయాలంటూ తిహార్ జైలు అధికారులకు వారెంట్‌ జారీ చేసింది. దీంతో మంగళవారం రాత్రి జైలు నుంచి విడుదలయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, బీఆర్ఎస్ నాయకులు జైలు వద్దకు చేరుకుని స్వాగతం పలికారు. ఇవాళ మధ్యాహ్నం 2.45 గంటలకు కవిత హైదరాబాద్‌ రానున్నారు. తిహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలను చూసి కవిత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పిల్లలను వదిలి ఐదున్నర నెలలు జైలులో ఉండటం ఇబ్బందికర విషయమన్నారు. తాను కేసీఆర్‌ బిడ్డను.. తప్పు చేసే ప్రసక్తే లేదని.. మొండిదాన్ని.. మంచిదాన్ని.. అనవసరంగా తనను జైలుకు పంపి జగమొండిని చేశారన్నారు. తనను ఇబ్బందులకు గురిచేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం అన్నారు. చట్ట బద్ధంగా తన పోరాటం కొనసాగిస్తానని, క్షేత్ర స్థాయిలో మరింత నిబద్ధతగా పనిచేస్తామన్నారు. కష్ట సమయంలో తన కుటుంబానికి తోడుగా ఉన్నవారికి ధన్యవాదాలు తెలిపారు.
న్యాయం గెలిచింది : కేటీఆర్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన నేపథ్యంలో ఆమె అన్న, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ‘‘థాంక్యూ సుప్రీంకోర్టు. ఊరట లభించింది.. న్యాయం గెలిచింది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయటంపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. సుప్రీంకోర్టుకు ఉద్దేశాలు ఆపాదించేలా కామెంట్స్‌ చేశారని బండి సంజయ్‌ తీరును తప్పుబట్టారు. కేంద్రమంత్రిగా ఉంటూ ఇంత చౌకబారుగా మాట్లాడుతారా అని విమర్శించారు. దురుద్దేశపూర్వకంగా బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.
బండి సంజయ్‌ ఏమన్నారంటే..?
కవితకు బెయిల్‌ మంజూరవడంపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ‘‘బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి బెయిల్ లభించినందుకు కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ న్యాయవాదులకు అభినందనలు. మీ అలుపెరగని ప్రయత్నాలు చివరకు ఫలించాయి. ఈ బెయిల్ బీఆర్ఎస్ , కాంగ్రెస్ రెండింటికీ విజయం. బీఆర్ఎస్ లీడర్ బెయిల్‌పై బయటకు రాబోతున్నారు. కాంగ్రెస్ వ్యక్తి రాజ్యసభకు ఎంపికయ్యారు. బెయిల్ కోసం మొదట వాదించిన వ్యక్తి పోటీ చేస్తే.. ఆ అభ్యర్థికి (అభిషేక్‌ మను సింఘ్విని ఉద్దేశిస్తూ) మద్దతు ఇచ్చి కేసీఆర్‌ రాజకీయ చతురత ప్రదర్శించారు’’ అని బండి సంజయ్‌ విమర్శలు గుప్పించారు.

Last Updated:2024-08-28

కరీంనగర్
పోలీసుల అదుపులో ముగ్గురు కార్పొరేటర్లు..?
కరీంనగర్: కరీంనగర్ లో భూకబ్జాలకు పాల్పడిన పొలిటికల్ లీడర్లపై ఫిర్యాదులు కమిషనరేట్ కు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత నెల రోజులుగా పలువురి కార్పొరేటర్లు.. సహా మాజీ మంత్రి గంగుల కమాలకర్ షాడో గా పేరుగాంచిన నందెల్లి మహిపాల్ ను సైతం పోలీసులు జైలుకు పంపించారు. తాజాగా కరీంనగర్ సిటీకి చెందిన మరో ముగ్గురు కార్పొరేటర్లు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం అందుతుంది. వారి డివిజన్లలో చేస్తున్న భూకబ్జాలపై అందిన ఫిర్యాదులో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పూర్తి స్థాయిలో విచారించిన తరవాత ఈ రోజు సాయంత్రం కానీ.. రేపు కాని అరెస్టు చూపే అవకాశాలున్నాయి. ఒకవైపు ఎక్కడిక్కడ కేసులు పెట్టి లీడర్లను అరెస్టులు చేస్తుంటే.. మాజీ రౌడీ షీటర్లు మాత్రం చెలరేగిపోతున్నారనే వార్తలు వస్తున్నాయి. సోమవారం కమిషనరేట్ లో జరిగిన ప్రజా దర్బార్ లో మాజీ రౌడీ షీటర్ అనూప్ పై భారీగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీపీ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

Last Updated:2024-02-28

కరీంనగర్
పోలీసుల అదుపులో ముగ్గురు ర్పొరేటర్లు..?
కరీంనగర్: కరీంనగర్ లో భూకబ్జాలకు పాల్పడిన పొలిటికల్ లీడర్లపై ఫిర్యాదులు కమిషనరేట్ కు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత నెల రోజులుగా పలువురి కార్పొరేటర్లు.. సహా మాజీ మంత్రి గంగుల కమాలకర్ షాడో గా పేరుగాంచిన నందెల్లి మహిపాల్ ను సైతం పోలీసులు జైలుకు పంపించారు. తాజాగా కరీంనగర్ సిటీకి చెందిన మరో ముగ్గురు కార్పొరేటర్లు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం అందుతుంది. వారి డివిజన్లలో చేస్తున్న భూకబ్జాలపై అందిన ఫిర్యాదులో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పూర్తి స్థాయిలో విచారించిన తరవాత ఈ రోజు సాయంత్రం కానీ.. రేపు కాని అరెస్టు చూపే అవకాశాలున్నాయి. ఒకవైపు ఎక్కడిక్కడ కేసులు పెట్టి లీడర్లను అరెస్టులు చేస్తుంటే.. మాజీ రౌడీ షీటర్లు మాత్రం చెలరేగిపోతున్నారనే వార్తలు వస్తున్నాయి. సోమవారం కమిషనరేట్ లో జరిగిన ప్రజా దర్బార్ లో మాజీ రౌడీ షీటర్ అనూప్ పై భారీగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీపీ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

Last Updated:2024-02-28

హైదరాబాద్
రోడ్డు ప్రమాదంలో యువ ఎమ్మెల్యే దుర్మరణం
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. ఓఆర్ఆర్‌పై ఆమె ప్రయాణిస్తోన్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడిక్కకడే మృతి చెందారు. ఆమె పీఏతో పాటు కారు డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యారు. కాగా, ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురే లాస్య నందిత. గతేడాది సాయన్న అనారోగ్యంతో కన్నుమూయగా.. సరిగ్గా ఏడాది పూర్తవ్వగానే నందిత దుర్మరణం పాలవడం వారి కుటుంబ సభ్యులను కలిచివేస్తుంది. వారంతా తీవ్ర విషాదంలో ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గద్దర్ కూతురు వెన్నెలపై కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

విధిరాతను తప్పించలేకపోయింది ..

లాస్య నందితకు ఈ మధ్యకాలంలోనే రెండు సార్లు ప్రాణాలనుంచి బయటపడి గండం గట్టెక్కింది. రెండు నెలల కిందట ఒక ప్రోగ్రామ్ కు వెళ్లిన ఎమ్మెల్యే లాస్య లిఫ్ట్ లో ఇరుక్కుపోయింది. సుమారుగా గంట పాటు అందులోనే నరకం అనుభవించింది. ఆ తరవాత ఇటీవల నల్లగొండ కేసీఆర్ సభకు వెళ్లి తిరిగి వస్తుండగా.. లాస్య కారును మరో వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆమె కారు ముందుకు దూసుకెళ్లి ఒక హోం గార్డు అక్కడిక్కడే చనిపోయాడు. రెండు సార్లు గండాల నుంచి తప్పించుకున్నా.. ఈ సారి రోడ్డు ప్రమాదరూపంలో యువ ఎమ్మెల్యేను బలితీసుకుంది.

Last Updated:2024-02-23

కరీంనగర్
గంగుల షాడో అరెస్టు..?
కరీంనగర్: - భూకబ్జాలు.. పైరవీలకు ఆయన మాటే లక్ష్మణరేఖ

- మాజీ మంత్రి అనుచరులు ఒక్కొక్కరుగా జైలుకు

ఎక్కడైనా మంచి ల్యాండ్ కనిపిస్తే చాలు ఆయన కళ్లు అక్కడ వాలిపోతాయి.. అనుచరులు రంగంలోకి దిగుతారు. నయానో భయానో ఆ భూమిని దక్కించుకుంటారు. కాదు కూడదని తిరగబడితే రాత్రికి రాత్రే 10 మంది దిగి.. కట్టుకున్న గూడును క్షణాల్లో కూల్చేస్తారు. నిలువనీడ లేకుండా చేసేస్తారు. జిల్లాలో ఏ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ఎక్కడ ఉండాలన్నా.. సీఐ, ఏఎస్ పీలు ఎక్కడికి ట్రాన్సఫర్ కావాలన్నా.. ఆయన కనుసైగ చేస్తే చాలు... ఆ క్షణంలో పని పూర్తవుతుంది. గంగుల కమలాకర్ మంత్రిగా ఉన్నన్ని రోజులు ఆయన చెప్పిందే పోలీస్ లకు వేదమంటే ఆయన రేంజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవాలి. మాజీ మంత్రి గంగుల కమాలకర్ కు అన్ని వ్యవహారాల్లో షాడోలా వ్యవహరించే నందెల్లి మహిపాల్ ను కరీంనగర్ పోలీసులు మంగళవారం ఉధయాన్నే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయన దగ్గరి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

భూకబ్జాలు, పైరవీలు, ఫైనాన్షియల్ అఫెన్సెస్ వ్యవ హారాల్లో తలదూర్చి పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్న వాళ్లపై కరీంనగర్లో పోలీసుల వేట కొనసాగుతోంది. తాజాగా బీఆర్ఎస్ మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు నందెల్లి మహిపాల్ ను అదుపులోకి తీసు కున్నట్లు సమాచారం. బాధితులు కొంతమంది కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతిని ఆశ్రయించడంతో వివిధ కోణాల్లో విచారించి మహిపాల్ అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసు అధికా రులు మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించడం లేదు. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా ఓలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన నందెల్లి మహిపాల్ ను విచారిస్తున్నారు.

Last Updated:2024-02-20

జనగామ
గురుకుల టీచర్ల అభ్యర్థులకు నియామకపత్రాల అందజేత
జనగామ: : జనగామ:

గురువారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎల్బీ స్టేడియంలో గురుకుల టీచర్ల అభ్యర్థులకు ఉద్యోగ నియామకపత్రాలను అందజేయనున్న నేపథ్యంలో జిల్లా నుంచి ఎంపికైన (20) మంది అభ్యర్థులను ప్రత్యేక బస్సులో హైదరాబాదుకు తరలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో జెడ్పీ సీఈవో అనిల్ కుమార్ అభ్యర్థులతో కూడిన బస్సును జెండా ఊపి ప్రారంభించారు. వారితో పాటు జిల్లా స్థాయి అధికారులు సైతం వెళ్లినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఏవో వినోద్ కుమార్, చేనేత & జౌళీ శాఖ ఏడీ చౌడేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

Last Updated:2024-02-16

జనగామ
అధికారులు లేకుండానే బడ్జెట్
జనగామ: - జిల్లా హెడ్ క్వార్టర్ మున్సిపాలిటీలోనే డిప్యూటేషన్ అధికారులా..?
- బడ్జెట్ మీటింగ్ లో నిలదీసిన కౌన్సిలర్లు
- అంకెలు మార్చి గారడి చేస్తున్నరంటూ విమర్శలు
• రూ.27.43 కోట్లకు ఆమోదం

జనగామ:

పేపర్ల మీదనే అంకెలు మార్చి కొత్త బడ్జెట్ గా చూపించారు.. పెరిగిన బడ్జెట్ కు నిధులు ఎక్కడి నుంచి వస్తాయనే వివరాలు లేవు. పట్టణంలో ప్రధాన అభివృద్ధి పనుల ఊసే లేదు. తూతూ మం త్రంగా సమావేశం ఏర్పాటు చేసి మమ అనిపిస్తు న్నారంటూ సభ్యులు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. గురువారం మున్సిపల్ చైర్ పర్సన్ పి.జమున లింగయ్య అధ్యక్షతన జరిగిన జనగామ మున్సి పల్ 2024-25 బడ్జెట్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పర్మర్ పింకేశ్ కుమార్ పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధిలో కీలకమైన బడ్జెట్ సమావేశానికి అధికారులు డుమ్మా కొట్టా రు.. కౌన్సిల్ సమావేశాలంటే గౌరవం లేకుండా పోతోందంటూ కొందరు కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా హెడ్క్వర్టర్.. పెద్ద మున్సిపా లిటీకి డిప్యుటేషన్ అధికారులేంటి అని నిలదీశారు. దీంతో గంటన్నర ఆలస్యంగా బడ్జెట్ సమావేశం మొదలైయింది.

కౌన్సిలర్ల ప్రశ్నల పరంపర

ఈ ఏడాది బడ్జెట్ లో పెరిగిన ఆస్తిపన్ను ఎలా చూపించారని బీజేపీ ఫ్లోర్ లీడర్ మహంకాళి హరిశ్చంద్ర గుప్తా ప్రశ్నించారు. గత ఏడాది కంటే ఆస్తిన్నుల రూపంలో రూ. కోటికి పైగా పెరగవచ్చని చేసిన అంచనాకు సంబంధించి వివరాలు చూపించాలని పట్టుబడ్డారు. బడ్జెట్ పేరిట అంకెల మార్పి డి చేశారని అన్నారు. అనేక కాలనీలు, వార్డు ల్లో నూతన నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు వాటికి అసెస్మెంట్ చేయకపోవడంతో పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోతున్నామని మండిపడ్డారు. గతం లో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా మున్సిపాలిటీకి వచ్చే కోట్లాది రూపాయల స్టాంప్ డ్యూటీ నేరుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడంతో పురపాలికలకు నిధుల కొరత ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కనీస పరిజ్ఞానం లేకుండా బడ్జెట్ రూప కల్పన చేశారని కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గాదె పాక రాంచందర్ ఆరోపించారు. బడ్జెట్లో వాస్తవా లు కనిపించడం లేదని, సామాన్యులకు మేలు చేసే కనీస సౌకర్యాలు లేవని మండిపడ్డారు. రూ.5 లక్ష లు ఖర్చు చేసి కనీసం ప్యాచ్ వర్క్ చేయలేని బడ్జెట్ ను ఎందుకు ఆమోదించాలని ప్రశ్నించారు. ట్రేడ్ లైసెన్స్ల నుంచి జంతువధశాల, స్టాంపుల వరకు కఠినతరం చేస్తే ఆదాయం పెరుగుతుందని సూచించారు.

సభ్యురాలు జక్కుల అనితవేణుమాధవ్ మాట్లాడుతూ శానిటేషన్ కార్మికులకు సబ్బులు, నూనె ఇచ్చినట్టు బడ్జెట్ కాపీలో చూపించడమే తప్ప ఏనాడూ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. బడ్జెట్ సమావేశంలో అధికారులు లేకపోవడం మున్సిపల్ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చని విస్మయం వ్యక్తం చేశారు. మారబోయిన పాండు మాట్లాడుతూ చెత్త సేకరణ ఆటోలకు రిజిస్ట్రేషన్ ఆలస్యం చేయడం కారణంగా భవిష్యత్లో ఇబ్బం దులు కలిగే ప్రమాదం ఉందన్నారు. ఎండీ. సమ్మద్ మాట్లాడుతూ పన్నుల వసూళ్లలో బిల్ కలెక్టర్లు శ్రద్ధ వహించాలని, ఈ విషయమై అధికారుల పర్యవేక్ష ణ ఉండాలన్నారు. వంగాల కల్యాణిమల్లారెడ్డి మాట్లాడుతూ బడ్జెట్ సమావేశానికి పలు విభాగాల అధికారుల గైర్హాజర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాంకోడు అనిత మాట్లాడుతూ బడ్జెట్లో బ్లీచింగ్ పౌడర్, దోమల మందు చూపించడమే తప్ప ఎక్కడా కనిపించడం లేదని మండిపడ్డారు. అనంత రం 2024-25 వార్షిక బడ్జెట్ రూ.27.43 కోట్లకు ఆమోదం తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పి. వెంకటేశ్వర్లు. వైస్ చైర్మన్ మేకల రాం ప్రసాద్, మేనేజర్ రాములు, శానిటరీ ఇన్స్పెక్టర్ మల్లిగారి మధు, శ్రీకాంత్, సురేందర్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.

Last Updated:2024-02-16

కరీంనగర్
అక్కడ భూమే లేదు.. కోటికి పైగా వసూలు చేసిండ్రు
కరీంనగర్: - కరీంనగర్ లో ఇద్దరు కార్పొరేటర్ల భర్తలు సహా ముగ్గురి అరెస్టు

కరీంనగర్ లో భూదందాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. ఇన్ని రోజులు భూమిని ఆక్రమించడం.. వాటిని తప్పుడు పత్రాల పేరుతో మోసాలు చేసేవారు. కానీ ఇప్పుడు ఏకంగా భూమి లేకుండానే రిజిష్ట్రేషన్ చేస్తామని నమ్మించి కాగితాల్లోనే అంతా మాయచేసి ఓ వ్యక్తి నుంచి సుమారుగా కోటికి పైగా వసూలు చేసిన భూదందారాయుళ్ల బాగోతాన్ని కరీంనగర్ పోలీసులు గుట్టురట్టు చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ రేకుర్తికి చెందిన బీఆర్ ఎస్ కార్పొరేటర్ సుదగోని మాధవి భర్త క్రిష్ణ గౌడ్, మరో కార్పొరేటర్ కోల ప్రశాంత్ లతో పాటు ఏలేటి భరత్ రెడ్డి అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు మరో ముగ్గురు గజ్జెల స్వామి, బసవయ్య, అస్తపురం అంజయ్యలపైనా కేసు నమోదు చేశారు.

రేకుర్తి ఏరియాలో గుంటకు రూ. 30 లక్షల వరకు పలుకుతుంది. 2014లోనే ఈ కార్పొరేటర్ల భర్తలిద్దరు మోసానికి తెరలేపారు. రేకుర్తిలో 10 గుంటల భూమి ఉందని చెప్పి వేములవాడకు చెందిన రాజిరెడ్డికి నకిలీ పత్రాలు చూపించి క్రిష్ణ గౌడ్ నమ్మించాడు. అప్పట్లో ఉప సర్పంచిగా ఉండటంతో ఆయన్ని నమ్మారు. తరవాత 2020లో రేకుర్తి కార్పొరేషన్ లో కలిసింది. అప్పుడే క్రిష్ణ గౌడ్ భార్య కార్పొరేటర్ గా గెలిచింది. అప్పటి నుంచి ఆయన చెప్పిందే వేదం. వీరి డివిజన్ ను ఆనుకునే మరో డివిజన్ నుంచి కోల ప్రశాంత్ సతీమణి కార్పొరేటర్ గా గెలిచాడు. వీళ్లిద్దరు కలిసి సమస్య పరిష్కారం చేస్తామని నమ్మించి రూ. 1.37 కోట్లు వసూలు చేశారు. ఈ విషయంలో మరికొందరు కూడా ఉన్నారు. బాధితుడు ఆధారాలతో సహా సీపీని కలిసి ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి నిందితులను అరెస్టు చేశారు.

Last Updated:2024-02-10

కరీంనగర్
గంగుల అనుచరుడు శ్రీపతి అరెస్టు
కరీంనగర్: కరీంనగర్ లో భూ కబ్జాదారులపై పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కబ్జాలకు పాల్పడిన ఇద్దరు కార్పొరేటర్లు.. సహా పలువురిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా మాజీ మంత్రి, ప్రస్తుత కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమాలకర్ కు అనుచరుడిగా పేరున్న తోట శ్రీపతి రావు అరెస్టు కావడం కలకలం రేపుతుంది. సిటీలోని వివేకానందపురి కాలనీకి చెందిన అనుమండ్ల రవీందర్ అనే వ్యక్తి 2014 మే నెలలో తీగలగుట్టపల్లి రోడ్ నం. 16 కార్తికేయ నగర్ లో 233/E నందు 144 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఆ స్థలానికి బేస్మెంట్ నిర్మించుకున్నాడు.. నవంబర్ 2023 లో బోర్ కూడా వేయించుకున్నాడు. మున్సిపల్ ఆఫీస్ నుండి అనుమతి పొంది నిర్మాణ పనులు స్టార్ట్ చేశాడు. గత నెల 10వ తేదీన రాత్రి 10:30 గంటలకు ఏడు నుంచి 12 మంది గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా ఇంటి నిర్మాణ స్థలంలోకి చొరబడి అప్పటికే నిర్మించిన 8 పిల్లర్లతో పాటు.. నీటి సంపు, నిర్మాణానికి ఉపయోగించే పరికరాలను నాశనం చేసి దాదాపు రూ. 4 లక్షల నష్టం చేశారు. ఈ వీడియోలు సైట్ దగ్గర సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వీటి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు.

ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో కరీంనగర్లోని చైతన్యపురి కాలనీకి చెందిన తోట శ్రీపతి రావు అనే వ్యక్తి, పొన్నాల కనకయ్య, పవన్ , సిరిపురం వెంకటరాజు మరి కొంతమందిని మనుషులను మాట్లాడి ఇంటి నిర్మాణం కూల్చవలసిందిగా ఆదేశించినట్లు తేలింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకుని పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసి పట్టుకునేందుకు స్పెషల్ టీం ను సైతం ఏర్పాటుచేసి గాలింపు చర్యలు చేపట్టారు . ఎట్టకేలకు నిందితుడు హైదరాబాద్ లోని అంబర్ పేట్ తన సోదరుని నివాసంలో ఉన్నట్లు గుర్తించిన స్పెషల్ టీం పోలీసులు ఎంతో చాకచక్యంగా సోమవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. తోట శ్రీపతిరావు అనే నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారని తెలిపారు.

కరీంనగర్ లో శివారు గ్రామాల్లో పెచ్చు మీరుతున్న భూకబ్జాలతో సామాన్యులు ఎంతో నష్ట పోతున్నారు. బీఆర్ ఎస్ నేతలు అధికారం ఉందనే కారణంతో ఎంతో మంది అమాయకులను ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పటికే ఓ కార్పొరేటర్ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ అయింది. కరీంనగర్ పోలీసులు తీసుకుంటున్న చర్యలతో సామాన్యులు చాలా సంతోషంగా ఉన్నారు. కబ్జాదారుల గుండెల్లో మాత్రం దడపుడుతోంది.. రేపు ఎవరు అరెస్టు కాబోతున్నారనే టెన్షన్ అయితే వాళ్లలో మొదలైంది.

Last Updated:2024-02-06

కరీంనగర్
అనాథలకు సేవచేస్తేనే ఆనందం
కరీంనగర్: పసుల క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ప్రొడక్షన్ మేనేజర్ రామోజు సంగీత పుట్టినరోజు పురస్కరించుకొని స్థానిక గిద్దెపెరుమళ్ళ ఆలయంలో గోశాలలో ఆవులకు ఆహారం అందించి మూగజీవులైన ఆవులను దర్శించుకొని ఆలయంలో పూజలు చేశారు. అనంతరం స్థానిక వెంకటేశ్వర ఆలయం ముందు ఉన్న యాచకులకు పండ్లు అందించారు. ఈ సందర్భంగా సంగీత మాట్లాడుతూ సామాజిక సేవకులు పసుల రవికుమార్ చేస్తున్న సామాజిక సేవలను చూసి తాను కూడా సామాజిక సేవలు చేయడానికి ముందుకు వచ్చానన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా గోశాల దర్శించుకోవడం జరిగిందన్నారు. జన్మదిన వేడుకలు ఆర్పాటంగా కాకుండా అనాధలకు యాచకులకు ఆహారం అందించి వాళ్లకు ఆకలిని తీర్చినప్పుడే నిజమైన జన్మదిన వేడుకగా జరుపుకోవాలని, ఒకరిని చూసి ఒకరు అనాథలకు సహాయ సహకారాలు అందించాలి ఆమె అన్నారు.

Last Updated:2024-02-06

కరీంనగర్
ఢిల్లీ ధర్నాకు డి.టి.ఎఫ్. నాయకులు
కరీంనగర్: కేంద్రం అమలు చేస్తున్న జాతీయ విద్యావిధానాన్ని నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద అఖిల భారత విద్యా హక్కు ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాలో పాల్గొనేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర,జిల్లా నాయకత్వం శుక్రవారం బయలుదేరారు. 46 మంది బృందం రామగుండం నుంచి ఏపీ ఎక్స్ ప్రెస్ రైల్లో వెళ్లారు. 2020 నుండి కేంద్రప్రభుత్వం అమలు పరుస్తున్న జాతీయ విద్యావిధానాన్ని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ తీవ్రంగా వ్యతిరేకించడమే గాకుండా, పూర్తిగా ప్రభుత్వరంగంలో కొనసాగించవలసిన విద్యను ప్రైవేటికరిస్తూ,కాషాయీ కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తున్న విషయం తెలిసింది. జాతీయ స్థాయిలో అఖిలభారత విద్యా హక్కు ఫోరమ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న పోరాటంలో భాగంగా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేష క్రియాశీల ఉద్యమాలను నిర్వహిస్తున్నది.

ఈ కార్యక్రమంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వైద్యుల రాజిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బి.శ్యాం,రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎం.రఘుశంకర్ రెడ్డి,రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ పల్కల ఈశ్వర్ రెడ్డి ,పూర్వ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ డి. ఏసురెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి తూముల తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షులు ఆవాల నరహరి, సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు యం.విష్ణు, కరీంనగర్ జిల్లా కార్యదర్శి ఏబూషి శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిలర్లు వి.రాంకిరణ్, పి.నర్సయ్య ,బి.సుదర్శన్ రెడ్డి, ఏ.రాంమోహన్, మండలాల బాధ్యులు,బి.శ్రీనివాస్ , కె.వెంకటస్వామి,కె.శ్రీనివాస్,సంపత్,తదితరులు ఈ బృందంలో వున్నారు.

Last Updated:2024-02-02

కరీంనగర్
భూకబ్జాలకు పాల్పడిన మాజీ ఎంపీటీసీ అరెస్టు
కరీంనగర్: - కరీంనగర్ లో కొనసాగుతున్న అరెస్టుల పర్వం
- కార్పొరేటర్ జంగిలి సాగర్ పై రౌడీ షీట్ ఓపెన్
నకిలీ డాక్యుమెంట్లు తయారుచేసి, అక్రమంగా భూకబ్జాకు పాల్పడిన నిందితుడు మాజీ ఎంపీటీసీ, (తీగలగుట్టపల్లి) కొమ్ము భూమయ్యను పోలీసులు అరెస్టుచేసి, రిమాండ్ కు తరలించారు. కొమ్ము భూమయ్య నకిలీ ధ్రువపత్రాలు తయారుచేయడమే గాక.. నకిలీ స్టాంపులు, సర్పంచ్ , పంచాయతీ సెక్రటరీ సంతకాలు ఫోర్జరీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కరీంనగర్ పోలీసులు భూ కబ్జారాయుళ్లపై చేపట్టిన ఆపరేషన్ ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటికే సిటీలోని ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో సీతారాంపుర్ కార్పొరేటర్ జంగిలి సాగర్ పై రౌడీ షీట్ తెరిచారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ శివారులో ఉన్న తీగలగుట్టపల్లిలో మరో భూమాఫియాకు అడ్డగా మారిన కొమ్ము భూమయ్య అరెస్టు సంచలనంగా మారింది. కొమ్ము భూమయ్య చేసిన కబ్జాల వివరాలను పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేట గ్రామానికి చెందిన దీటీ మధు 2013 లో ఆరెపల్లి గ్రామ శివారులో గల సర్వే నెంబర్ 311, ఓపెన్ ప్లాట్ నంబర్.5 లో గల 91 గజాల ఇంటి స్థలాన్ని కరీంనగర్ కు చెందిన నల్లవెల్లి రాజు నుంచి ఖరీదు చేశాడు. ఈ స్థలాన్ని ఇంటి నిర్మాణం కోసం తన భార్య ఎండల సరిత పేరున మార్చాడు. మున్సిపాలిటీ ద్వారా ఇంటి నంబర్ 4-63/A/A/2/A/1 తీసుకుని నిర్మించుకున్నాడు. ఓ రోజు గుంజ లక్ష్మణ్ అనే వ్యక్తి అక్రమంగా, తన ఇంటిలో చొరబడి తనకున్న ఆ ఇంటిని కాజేయాలనే నేరపూరిత కుట్రతో, ఇంటి గేటుపై ఉన్నటువంటి ఇంటి నెంబర్ ప్లేట్ ని తొలగించి మరొక ఇంటి నెంబర్ 1-42/6/E/4/A/1 గల ప్లేటును తగిలించాడు. ఈ స్థలం తనదేనని, తీగులగుట్టపల్లి కి చెందిన మాజీ ఎంపీటీసీ కొమ్ము భూమయ్య వద్ద నుండి కొనుగోలు చేశానని వాగ్వివాదానికి దిగాడు. ఇంటిని వదిలి వెళ్లకపోతే చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై దీటి మధు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

మాజీ ఎంపీటీసీ కొమ్ము భూమయ్య, గుంజ లక్ష్మణ్ లు ఇద్దరు మధుకు చెందిన ఇంటిని కాజేయాలని సర్పంచ్ , పంచాయతీ సెక్రెటరీ సంతకాలను ఫోర్జరీ చేసి అదే ఇంటి స్థలంపై నకిలీ ధ్రువపత్రాలు సృష్టించారని విచారణలో తేలింది. అక్రమంగా ఇంట్లో చొరబడి, దౌర్జన్యానికి పాల్పడి ఇంటి నెంబర్ తొలగించినందుకు, ఇంటి యజమానిని చంపుతానని బెదిరించినందుకుగాను కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు Cr. No. 69/2024, U/Sec 420, 465,467,471,447,427,506,120-b r/w 34 IPC పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ముద్దాయిలను కోర్టులో హాజరుపరిచారు. ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముద్దాయిలకు 15 రోజుల రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.

Last Updated:2024-02-02

ఉద్యోగ నోటిఫికేషన్‌లు

Remember, torn clothes should not be left at home. Dispose of them out. Buying new clothes like towels.
Read

wearing clothes, bedsheets are like inviting good luck to the home.

Arrange doormats before every door and please change the doormats once in 6/8 months or maximum within 1 year. For More Daily

చరిత్రలో ఈరోజు [Feb-06 ]

1819: సర్ థామస్ స్టామ్ఫోర్డ్ రాఫెల్స్ సింగపూరు పట్టణాన్ని కనుగొన్నాడు.,
1952: విక్టోరియా మహారాణి అనంతరం ఎలిజబెత్ II యునైటెడ్ కింగ్డం మహారాణిగా కిరీటాన్ని ధరించింది.
2000: ఫిన్లాండు తొలి మహిళా అధ్యక్షురాలిగా టార్జా హలోనెల్ ఎన్నికైంది.
2023 - ఆగ్నేయ టర్కీలోని గాజియాంటెప్ ప్రావిన్స్‌లో 7.8 (Mww) భూకంపం సంభవించింది. సమీపంలోని కహ్రమన్మరాస్ ప్రావిన్స్‌లో అదే రోజున 7.5 Mww ఆఫ్టర్‌షాక్ ఏర్పడింది. టర్కీ, సిరియాలలో అధిక నష్టం జరుగగా 34,800 మందికి పైగా మరణించారు, 87,000 మందికిపైగా గాయపడ్డారు.
2023: తెలంగాణ శాసనసభ సమావేశాలలో 2023-24 ఆర్థిక సంవత్సారానికి బడ్జెట్ ప్రవేశపెట్టబడింది.

WhatsApp